పీకల్లోతు కష్ట్టాల్లో జేడీఎస్

Date:16/12/2019

బెంగళూరు ముచ్చట్లు:

కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత దారుణంగా తయారైన పార్టీ ఏదైనా ఉందా? అంటే ఠక్కున సమాధానం జనతాదళ్ ఎస్ అని వస్తుంది. పదిహేను స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే పన్నెండు చోట్ల పోట ీ చేసి ఒక్క చోట కూడా గెలవకుండా జేడీఎస్ రికార్డు సృష్టించింది. అనేక చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లు జేడీఎస్ సాధించింది. దీంతో జేడీఎస్ ఉన్న ఎమ్మెల్యేల్లోనూ అనుమానాలు తలెత్తాయి. అసలు వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అన్నది కూడా డౌటు కొడుతోంది.ఇప్పటికే జనాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ వయసు మీద పడటం, ఎక్కువగా తిరగలేక పోతుండటంతో పార్టీని గాడిన పెట్టే పరిస్థితి లేదు. ఆయన మాట కూడా ఎవరూ కేర్ చేయడం లేదు. కుమారస్వామి కూడా పూర్తి ఆరోగ్యంగా లేరు. ఆయన కూడా ఎక్కువగా తిరగలేని స్థితి. ఇక మరో సోదరుడు రేవణ్ణ కు కూడా అంత పట్టులేదు. పార్టీలోనూ, ప్రజల్లోనూ రేవణ్ణకు పెద్దగా ఆదరణ కూడా లేదు. దీంతో పార్టీని నడిపించే వారు ఎవరూ కనుచూపు మేరలో లేరు.జేడీఎస్ కు ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెద్దగా లేదు. 32 మంది మాత్రమే ఉన్నారు.

 

 

 

 

 

 

 

వారిలో అనేక మంది ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. కొందరైతే తాము వచ్చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకపోవడంతో బీజేపీ కూడా జేడీఎస్ శాసనసభ్యుల జోలికి వెళ్లకపోవచ్చు. అయినా జేడీఎస్ శాసనసభ్యులు మాత్రం బీజేపీకి దగ్గరవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జేడీఎస్ శాసనసభ్యుడు సురేష్ గౌడ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పాదాభివందనం చేయడాన్ని చూడవచ్చు.ఈ పరిస్థితుల్లో 2023 ఎన్నికల నాటికి జనతాదళ్ పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 2018 ఎన్నికల్లోనే జనతాదళ్ ఎస్ పెద్దగా ప్రతిభ కనపర్చలేకపోయింది. అప్పటి వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తనకు పట్టున్న ప్రాంతాల్లో సయితం బలాన్ని ప్రదర్శించలేకపోయింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో పార్టీ విస్తరించలేదన్న వాదన కూడా ఉంది. ఇలా జేడీఎస్ కథ ముగిసిపోయినట్లేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఉన్న ఎమ్మెల్యేలు సయితం పార్టీని వీడి వెళ్లే పరిస్థితి నెలకొంది.

 

ప్రశాంత్ కిషోర్ కు డిమాండ్ పెరుగుతోంది

 

Tags:JDS in Peelakoluthu Kasttal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *