ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించిన జేడీయూ

Date:17/09/2020

పాట్నాముచ్చట్లు:

ఎన్నికల వేళ బీహార్ రాజీకీయాలను బీజేపీ తన వైపు వేగంగా తిప్పుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవడం లేదు. ప్రత్యర్థిని బలహీన పర్చడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీహార్ ను మళ్లీ సొంతం చేసుకుని, దేశంలో తమకు తిరుగులేదని చెప్పుకోవడమే బీజేపీ టార్గెట్ గా కన్పిస్తుంది. కరోనా సమయంలోనూ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదని నిరూపించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.ఇందులో భాగంగానే బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే అక్కడ బలంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ ను దెబ్బతీసే పనిలోపడింది. మానసికంగా బలహీన పర్చడంతో పాటు ప్రజల్లో కూడా ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను కల్గించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. బీహార్ లో ప్రధానంగా ఆర్జేడీయే శత్రువు. ఆర్జేడీకి ప్రజల్లోనూ, ముఖ్యంగా ఒక వర్గంలోనూ బలం ఉంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ను జైలుకు పంపడంతో సానుభూతి ఆ పార్టీకి ఎక్కువగా ఉంది.బీహార్ ఎన్నిలకు రెండు నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సన్నిహితుడైన రఘువంశ్ ప్రసాద్ కు బీజేపీ వల విసిరింది.

 

 

రఘువంశ్ ప్రసాద్ రాజకీయంగా లాలూ ప్రసాద్ యాదవ్ తో దశాబ్దాల పాటు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. 1997 నుంచి ఆయన లాలూ వెంట ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత ఆయనే ఆర్జేడీలో సీనియర్ నేత. ఆయనను జేడీయూలో చేర్పించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి.రఘువంశ్ ప్రసాద్ బీజేపీలో చేరరు. జేడీయూలోనే చేరుతున్నారు. అంటే ఎన్డీఏలో ఉంటారు. ప్రధానంగా తేజస్వియాదవ్ పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. లాలూ లక్షణాలేవీ తేజస్విలో లేవని చెబుతున్నారు. తేజస్వి వైఖరి కారణంగానే ఆయన పార్టీని వీడారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి జేడీయూలో చేరారు. ఇలా ఎన్నికలకు ముందే ఆర్జేడీని పూర్తిగా బలహీన పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి బీహార్ ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారన్నది భవిష్యత్ లో చూడాలి.

వ్యూహ‌త్మక అడుగుల‌తో చంద్ర‌బాబు

Tags: JDU launched Operation Aakash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *