చెన్నైలోని టిటిడి ధర్మశాల, సమాచార కేంద్రంలో జెఈవో తనిఖీలు

JEC Checks in TTD Dharamsala, Information Center in Chennai
Date:24/04/2019
చెన్నై ముచ్చట్లు:
చెన్నై రాయపేటలోని వివిఆర్‌ ధర్మశాల, టి.నగర్‌లోని టిటిడి సమాచార కేంద్రం, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. చెన్నై రాయపేటలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిఆర్‌ ధర్మశాల, టి.నగర్‌లోని సమాచార కేంద్రాని బుధవారం జెఈవో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ చెన్నై రాయపేటలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిఆర్‌ ధర్మశాలలో గదులలో మరింత మెరుగైన సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ధర్మశాలలో బెడ్‌షీట్లు, దిండుకవర్లు ఎప్పటికప్పుడు మార్చాలని, భవనానికి పెయింటింగ్‌, అవసరమైన మరమ్మతులు చేపట్టి భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలన్నారు. పచ్చదనం పెంచి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
అనంతరం టి.నగర్‌లోని సమాచార కేంద్రం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరువాభరణం, పడికావలి, దాతల రిజిష్టర్‌ల నిర్వహణను పరిశీలించారు. ఈ-దర్శన్‌ కేంద్రం, సమాచార కేంద్రంలో ఫ్లొరింగ్‌, పెయింటింగ్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రార్థన మందిరంలోని దశావతరాల విగ్రహాల సుందరీకరణ, పాత ఫోటోల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Tags:JEC Checks in TTD Dharamsala, Information Center in Chennai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *