అందుబాటలో జేఈఈ, నీట్ మాక్ టెస్టులు

Date:04/06/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

ఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది.నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఎన్‌టీఏ వెబ్‌సైట్  లో కూడా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని వివరించింది.జులై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జూలై మొదటి వారంలో హాల్‌టికెట్లను జారీ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో జులైకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.పరీక్షలు నిర్వహించే నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష ఉంటుందని పేర్కొంది.విద్యార్థుల పరీక్ష కేంద్రాల వివరాలతో కూడిన హాల్‌టికెట్లను పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందుగా జారీ చేస్తామని వెల్లడించింది. జూలై 26వ తేదీన నిర్వహించనున్న నీట్ హాల్‌టికెట్లను కూడా 15 రోజుల ముందుగా వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

కియా ఫ్యాక్టరీలో కరోనా కలకలం

Tags: JEE and NEET MAC Tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *