Jeevo S. Bhargavi felicita a los mejores estudiantes talentosos en las universidades TTD

టిటిడి కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జెఈవో ఎస్‌.భార్గ‌వి అభినందనలు

Date:20/06/2020

తిరుపతి ముచ్చట్లు:

టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జెఈవో(విద్య, ఆరోగ్యం) ఎస్‌.భార్గ‌వి అభినందనలు తెలిపారు. శనివారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల కార్యాలయంలో జెఈఓను సదరు విద్యార్థులు కలిశారు. టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం MPC(English Medium) చదువుతున్న R.Venkata Vara Prasad Reddy, 456/470 మార్కులతో కళాశాలలోనే ఉత్తమ మార్కులతో First Rank సాధించాడు. అదేవిధంగా, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం MPC(English Medium) చదువుతున్న R.మోహనశ్రీ కూడా కళాశాలలోనే (First Rank) ఉత్తమ పాయింట్లతో(10/10) ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరిరువురు తిరుమల తిరుపతి దేవస్థానములు యందు superintendent గా పనిచేయుచున్న   R.సుధాకర్ రెడ్డి పిల్లలు.

 

 

ఈ సందర్భంగా విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, బోధించిన ఉపాధ్యాయులకు జెఈఓ అభినందనలు తెలియజేశారు. అనంతరం అబ్దుల్ కలాం, మలాల జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు బహూకరించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జెఓవో ఆకాంక్షించారు.టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్ జి.వెంకటేశం ఉద్యోగ సంఘాల నాయకులు మల్లారపు నాగార్జున, జి.వెంకటరమణారెడ్డి, ప్రసాదరావు, భాస్కర్, గుణశేఖర్, కల్పన తదితరులు సదరు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

రెండో విడత వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం

Tags: Jeevo S. Bhargavi felicita a los mejores estudiantes talentosos en las universidades TTD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *