Natyam ad

టీటీడీ గోడౌన్లను తనిఖీ చేసిన జేఈవో  సదా భార్గవి

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని టీటీడీ గోడౌన్లను జేఈవో  సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు.గోడౌన్లలోని బియ్యం, జీడిపప్పు, కందిపప్పు, వంట నూనెలు తదితర సరుకులను పరిశీలించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గోడౌన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన చోట గోడౌన్లకు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అనంతరం తల వెంట్రుకలు నిలువ చేసే గోడౌన్ తనిఖీ చేశారు. తల వెంట్రుకలను వేరు చేయడం, శుభ్రపరచడం, ఎండబెట్టే ప్రక్రియ పరిశీలించి పలు సూచనలు చేశారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను పరిశీలించి, త్వరితగతిన టెండర్లు పిలిచి వాటిని విక్రయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీల్లో మార్కెటింగ్ డిప్యూటీ ఈవో   పద్మావతి, జిఎం ( కొనుగోలు) కృష్ణారెడ్డి, ఇఇ  సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: JEO Sada Bhargavi inspected the godowns of TTD

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.