JEO Sada Bhargavi inspecting the sanitation activities in the TTD administration building

టిటిడి పరిపాలనా భవనంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించిన జెఈవో సదా భార్గ‌వి

Date:22/10/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పారిశుద్ధ్య చర్యలతోపాటు ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలోని పలు స్టాక్ గోడౌన్లను జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య)  సదా భార్గ‌వి గురువారం పరిశీలించారు.  టిటిడి పరిపాలన భవనంలోని మరుగుదొడ్లను, నీటి కొళాయిలను జెఈవో పరిశీలించారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన చోట్ల ఆటోమేటెడ్ హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల వద్ద గుర్తించిన లోపాలను సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులు త్వరితగతిన సరి చేయాలన్నారు. అనంతరం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద, ఓల్డ్ హుజుర్ ఆఫీస్ వద్ద గల ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలోని స్టాక్ గోడౌన్లను తనిఖీ చేశారు.       జెఈవో వెంట టిటిడి అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.

నవంబర్ 28 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

Tags; JEO Sada Bhargavi inspecting the sanitation activities in the TTD administration building

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *