అధిక ఫీజులపై జేసీ ఆగ్రహం పలు ఆసుపత్రులకు జరిమానా

అనంతపురంముచ్చట్లు:

అనంతపురం జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నాలుగు ప్రైవేటు ఆస్పత్రులకు భారీగా జరిమానా విధించారు. ఆశా ఆసుపత్రికి 3 లక్షలు, ఎస్వీ ఆసుపత్రికి 2 లక్షలు, సాయిరత్న ఆసుపత్రికి 2.10 లక్షలు, ఎస్ఆర్ ఆసుపత్రికి 2.55 లక్షల జరిమానాను విధించారు. కోవిడ్ సాకుతో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు చేపట్టారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యల కోసం ఇప్పటికే ప్రభుత్వం 256 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలను సహించేది లేదని… రెండో సారి తప్పు చేసే ఆస్పత్రులపై ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Jesse is angry over the high fees
Fines for many hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *