జీజీహెచ్ దగ్గర అందోళన

Date:14/12/2019

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరులోని జీజీహెచ్వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు రామిరెడ్డి నగర్ లో అత్యాచారానికి గురై.. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఐదేళ్ల బాలికను పరామర్శించేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రి ఎదుట జనసేన, వామపక్ష, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగారు.  వాసిరెడ్డి పద్మను బంధువులు, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని వాసిరెడ్డి పద్మను కారు ఎక్కించారు. అయినా ఆందోళనకారులు ఆగకుండా కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అందోళనకారులు డిమాండ్ చేసారు.

 

ప్రధాన మంత్రి నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే…

 

Tags:JGH is an all-rounder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *