నెల్లూరులో జిందాల్ ప్లాట్

నెల్లూరు ముచ్చట్లు:

 

ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ జిందాల్‌ నెల్లూరులో ప్లాంటు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిందాల్‌ ప్లాంటు ఏర్పాటైతే ఆ విమర్శలను తిప్పికొట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్‌ సమావేశంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సిఫార్సులతో పరిశ్రమలు, ఆర్ధికశాఖ అధికారులు సిద్ధమయ్యారు.నల్వా స్టీల్స్‌కు అనుబంధంగా ఉన్న జిందాల్‌ స్టీల్స్‌-జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, మొమిడి గ్రామాల్లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఏడాదికి 2.25 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో ఏటా 2.25 మిలియన్‌ టన్నుల టిఎంటి ఇనుప బార్‌లు, వైర్‌ రాడ్స్‌ తయారు చేయడం ఈ ప్రతిపాదనల లక్ష్యం.

 

 

 

దీనికి రూ.7500 కోట్లు పెట్టుబడి వ్యయం అవుతుందని అంచనాపరిశ్రమ ప్రారంభమైతే ప్రత్యక్ష్యంగా 2500 మందికి, మరోక్షంగా 15 వేల మందికి ఉపాథి లభిస్తుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనికోసం వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుందని కోరారు.దీనిపై ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల సంస్థ అధ్యయనం చేసి 860 ఎకరాలు అవసరమవుతుందని తేల్చారు. భూమిని ఎపిఐఐసి నిర్ణయించిన ధరకు ఇవ్వాలని, పునరావాసం వ్యయాన్ని జిందాల్‌ భరించేలా ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమికంగా ఎపిఐఐసి కొన్ని సిఫార్సులను చేసిరది. ఇందులో భాగంగా ఈ రెండు గ్రామాల్లో ఉన్న సాధారణ భూమి ధర, ఎపిఐఐసి సిఫార్సు చేసిన ధర, ఆ గ్రామాల్లో సగటున జరుగుతున్న అమ్మకపు ధర, 2013 భూసేకరణ చట్టం మేరకు ఉన్న ధరలతో వివరాలు సిద్ధం చేసారు. దీనిలో ఎరత ధరకు భూమిని జిందాల్‌కు ఇస్తారన్నది ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసేరదుకు ముందుకొచ్చిన కినేటా పవర్‌ సంస్థకు ఇచ్చిన భూమినే ఇప్పుడు జిందాల్‌కు ఇవ్వాలని భావిస్తున్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Jindal Plot in Nellore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *