Natyam ad

జిన్నా టవర్ పేరు మార్పు సంగతేంటీ 

గుంటూరు ముచ్చట్లు:


ఒక‌రికి ఎన్టీరామారావు గొప్ప మ‌రొక‌రికి చిరంజీవి మ‌హాగొప్ప‌, ఒక‌రికి వైఎస్సార్ అంటే గొప్ప‌. అలాగ‌ని త‌మ ఇష్టం ప్ర‌కారం అన్నీ మ‌న‌ వాళ్ల‌పేర్లే ఉండాలంటే ఎలా అవుతుంది. అంద‌రికీ ఇష్ట‌మైన‌వారు, ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌ న‌వ‌స‌రం లేని రాజ‌కీయ‌వేత్త‌లు, నాయ‌కులు ఉంటారు.. గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయి, పి,వి, న‌ర‌ సింహా రావు, ఎన్టీ రామారావు లాంటివారు. వారు సామాజికంగా, రాజ‌కీయంగానూ త‌మ ప్ర‌త్యేక‌త‌ ల‌తో దేశ ప్ర‌జ‌ ల్ని అమితంగా ఆక‌ట్టుకు న్న‌వారు. అందువ‌ల్ల వారి మ‌ర‌ణానంత‌రం ఏదో ఒక ప్ర‌త్యేక క‌ట్ట‌డానికో, ఉన్న క‌ట్ట‌డానికో వారి పేరు పెట్టుకుని గౌర‌వించుకోవ‌డం చాలా స‌హ‌జం. అంతేగాని అధికారం ఉందిగ‌దా అని పేర్లు మార్చేస్తానంటే ఎలా? ఇపుడు తెర‌మీదకి తాజాగా పేర్ల మార్పిడి చిత్రం వ‌చ్చింది. ఎవ‌రికి తోచిన‌ట్టు వారు మార్చేయ‌డానికి పూనుకుంటున్నారు.

 

 

గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌బుత్వం ఏకంగా విమానాశ్ర‌యానికి రాజీవ్‌గాంధీ పేరెట్టేసు కున్నారు. కేంద్రంలో బీజేపీవారు ఏకంగా ప‌ట్ట‌ణాల‌పేర్లు మార్చే య‌జ్ఞం చేయ‌డానికి పూనుకుంది. అంత‌టితో ఆగకుండా ఏకంగా తాజ్‌మ‌హ‌ల్ పేరునీ మార్చేస్తామ‌ని ఆమ‌ధ్య ప్ర‌క‌టించింది. ఇంత‌కంటే ప్ర‌జాసంక్షేమ ప‌థకాల‌ అమ‌లు గురించి ప‌ట్టించుకుంటే చాలుగ‌దా  అన్నాడు ఢిల్లీలో ఆటోవాడు. తాజ్‌ మ‌హ‌ల్  పేరు అదే ఉన్నా, మార్చినా ఎవ‌రు ప‌ట్టించుకుంటారన్న‌ది సాధార‌ణ ప్ర‌జానీకం అభిప్రాయం. కానీ ప్ర‌భుత్వా లు ఊరుకునేట్టులేవు. ఇపుడు తాజాగా అదే ఆలోచ‌న ఏపీ స‌ర్కార్‌కీ వ‌చ్చింది. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్ట‌డానికి గ‌ట్టి నిర్ణ‌యం తీసేసుకుంది. విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. కానీ మొండి వాడి ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌దుగ‌దా!ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చి తీరుతాన‌ని తీర్మానించారు. వెంట‌నే విప క్షాలు, తెలుగు ప్ర‌జ‌లు, అన్ని పార్టీల నాయ‌కులు అంతా పేరు మార్చ‌ద్ద‌య్యా సామీ ఎందుకు భ్ర‌ష్టుప‌డ తావు అని అన్నారు. స‌సెమిరా కాద‌న్నాడు. బీజేపీ వారికి కోపం చిర్రెత్తుకొచ్చింది. అయితే గుంటూరు లోని  జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చండి సార్ అన్న డిమాండ్ మ‌ళ్లీ తెర‌మీద‌కి తెచ్చారు. బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ రెడ్డి గుంటూరులోని జెన్నా సెంట‌ర్ పేరు మార్చాల‌ని అన్నారు.నిజానికి ఈ డిమాండ్ ఇపుడే వ‌చ్చింది కాదు,

 

 

Post Midle

ఆ మ‌ధ్య కూడా త‌లెత్తింది. కానీ అది అర్ధంలేని డిమాండ్ అంటూ స‌ద‌రు ఏపీ ప్ర‌భుత్వ‌మే కొట్టిప‌డేసింది. జిన్నా ట‌వ‌ర్ అనేది మ‌త‌మౌఢ్యంతో పెట్టిన పేరు కాద‌ని, అప్ప‌టి కాల ప‌రిస్థితులు, జిన్నా భార‌త్‌తో ఉన్న అనుబంధానికి గుర్తుగా పెట్టిన‌ద‌ని స‌మా ధానం ఇచ్చుకున్నారు. స‌రే చరిత్ర ఏమి చెబుతున్న‌ప్ప‌టికీ, ఒక దురాలోచ‌న వ‌చ్చిన‌పుడు దానికి ధీటుగా మ‌రో ఇర‌కాటంలో పెట్టే ఆలోచనే వ‌స్తుంది. అదే పెద్ద స‌మ‌స్య‌గా, ప్ర‌శ్న‌గా ప్ర‌బుత్వాన్ని నిల‌దీస్తుంది. ఇపుడు అదే ఇర‌కాటంలో ప‌డింది ఏపీ ప్ర‌భుత్వం. త‌మ తండ్రిగారు మంచి డాక్ట‌ర్‌గా, మంచి పాల‌కునిగా, నాయ‌కునిగా అనేక‌మంది వీరాభిమానుల‌ను సంపాదించుకోవచ్చు కానీ  మ‌రో మ‌హానుభావుడి పేరున ఉన్న సంస్థ‌కు తండ్రిపేరు పెట్టాల‌నుకోవ‌డంలో ప్ర‌త్యేక వివ‌ర‌ణ అంటూ జ‌గ‌న్ ఇవ్వ‌లేదు. వైఎస్సార్ అంటే అంద‌రికీ అభిమాన‌మే. అంద‌రికీ ఇష్ట‌మే. అలాగ‌ని ఇబ్బందిక‌రంగా ఉండే నిర్ణ‌యా ల‌తో ప్ర‌జ‌లు, విప‌క్షాలు ఆగ్ర‌హించి, ఎదురుతిరిగే ఆలోచ‌న‌లు చేయ‌డం ప్ర‌భుత్వానికే న‌ష్టం అన్న‌ది జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అనుకోవాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇపుడు బీజేపీ నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్ లేవ‌నెత్తిన అంశం కాస్తంత పాత‌దే, ప్ర‌జ‌లు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ ప్ర‌స్తుతం హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చాల‌న్న ఆలోచ‌న‌తో మొండిగా సీఎం వ్య‌వ‌హ‌రిచ‌డంతో మ‌ళ్లీ బీజేపీ వారి డిమాండ్‌కి ప్రాధాన్య త ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. విప‌క్షాలకు ఆ అవ‌కాశం ఇచ్చి నెత్తిన మొట్టికాయ‌లు వేయించుకోవడంలో స‌ర‌దా ఏమిటన్న‌ది వైసీసీ నాయ‌కులే చెప్పాలి.

 

Tags: Jinnah Tower name change Sangatenti

Post Midle