జీవో 52 తక్షణమే రద్దు చేయాలి
విశాఖపట్నం ముచ్చట్లు:
బోయ వాల్మీకి, అగ్రకులాల్లో ఉన్న వారిని ఆదివాసి జాబితాలో చేర్చే జీవో 52ను తక్షణమే రద్దు చేయాలని విశాఖలో ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెంట్రల్ చైర్మన్ చక్రి నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దక్షిణ నియోజకవర్గ పరిధిలో గల జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న ఎస్టీల కంటే చాలా కాలం క్రితమే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన గిరిజనేతరులకు ఎస్టి రిజర్వేషన్ కల్పిస్తే నిజమేనా ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే జీవోను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
Tags; Jive 52 should be canceled immediately

