జాగ్వార్‌ రేంజ్ రోవర్ ఎవోక్‌ కొత్త ఎడిషన్‌

 JLR new vehicle Launch

 JLR new vehicle Launch

సాక్షి

Date :20/01/2018

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. రేంజ్ రోవర్  ఎవోక్‌ లాండ్‌మార్క్‌ కొత్త ఎడిషన్‌ను ప్రారంభించింది.. దీని ధరను రూ. 50.20 లక్షల (ఎక్స్-షోరూమ్) గా  నిర్ణయించింది.  ఇండియాలో  ఎవాక్‌ మోడల్‌ లాంచ్‌ చేసి ఆరేళ్లయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్‌ను  తీసుకొచ్చినట్టు చెప్పింది. ఆకర్షణీయమైన మెరైన్‌ బ్లూ  షేడ్‌తో మూడురంగుల్లో ఇది లభిస్తుదని జాగ్వార్‌  ప్రకటించింది.

పాత రేండ్‌ రోవర్‌ మాదిరిగానే ఉన్నప్పటికీ డిజైన్‌ 2.0 లీటర్ ఇంజినియం డీజిల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే    ‘ల్యాండ్‌మార్క్‌’ లెటర్స్‌ను,   గ్రాఫైట్‌ అట్లాస్‌ , ముందు భాగంలో ఫెండెర్ వెంట్స్  విజువల్ మార్పులను చేసింది.   ఇది 180సీఎస్‌ పవర్ , 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.  9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను అమర్చింది.  అలాగు తన స్టాండర్డ్‌ వైఫై హాట్‌ స్పాట్‌, ప్రో సేవలు, కీలేస్ ఎంట్రీ , గెశ్చర్‌ ఓరియెంటెడ్‌   టెయిల్ గేటు లాంటి ఆఫర్లు కూడా లభ్యం. మరోవైపు జాగ్వార్‌   స్పెషల్‌  వేరియంట్‌లో పోలిస్తే ఎవాక్‌ ఎల్‌ఈ  25వేల రూపాయలకు లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *