ఘనంగా జేఎన్టీయూ స్నాతకోత్సవం
హజరయిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ ముచ్చట్లు:

కూకట్పల్లి జెఎన్టియులో పదకొండవ స్నాతకోత్సవo ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళ్ సాయి ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిమిత వనరులైన సమర్థవంతంగా ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు గోల్డ్ మెడల్ వచ్చినా రాకున్నా విద్యార్థులు డిప్రెషన్కు గురి కాకూడదు అన్నారు సమస్య ఎంత పెద్దదైన పట్టుదలతో అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి వ్యక్తి పురోగతి సాధిస్తే అది దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. సమీప భవిష్యత్తులో దేశ ఆదాయం సెవెన్ ట్రిలియన్ ఆదాయం ఉన్న దేశంగా అవతరించాలని ప్రధాని మోడీ లక్ష్యంగా నిర్దేశించారన్నారు విద్యార్థుల సైతం అంత దూరదృష్టితో పని చేయాలన్నారు.
దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన సైనికుల గురించి విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్లర్ నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కస్తూరి రంగ గవర్నర్ తమిళ్ సాయి శాస్త్ర సాంకేతిక రంగంలో పీహెచ్డీ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ తో పాటు అత్యుత్తమ విద్యను ప్రదర్శించిన విద్యార్థులకు తమిళ సాయి గోల్డ్ మెడల్ అవార్డులను, పట్టాలను ప్రధానం చేశారు. కస్తూరి రంగన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి లక్ష్యంగా విద్యార్థుల పరిశోధనలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొనసాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఎన్టీయూ విసి కట్టా నరసింహారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags;JNTU graduation ceremony
