ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
పత్తికొండ ముచ్చట్లు:
పత్తికొండ పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు శుక్రవారం నిర్వహించారు. జాబ్ మేళా కార్యక్రమంలో 8 కంపెనీలకు చెందిన ప్రతినిధులు, రిలయన్స్ ఫౌండేషన్ అపార్ట్ ఎన్జీవోల ప్రతినిధులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్తికొండ దేవనకొండ గోనెగండ్ల కోడుమూరు ఆస్పరి తుగ్గలి మద్దికెర మండలాల నుండి నిరుద్యోగులు జాబ్ మేళా కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి రేఖా రెడ్డి, రిలేషన్ ఫౌండేషన్ జిల్లా అధికారి సురేంద్రనాథ్, ప్లేస్మెంట్ అధికారి సూర్య చంద్ర, అపార్ట్ సీఈవో తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Tags: Job Fair in Govt Degree College

