జాబ్ లెస్ క్యాలండర్ రద్దు చేయాలి

విశాఖపట్నం ముచ్చట్లు :

 

నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు పైచిలుకు  ఇస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.తక్షణమే జీవో నెంబర్ 39తో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ని రద్దు చేసి నూతనంగా అన్ని శాఖల ఉద్యోగలు పారదర్శకంగా ఉండేలా చూడాలని జాబ్ క్యాలెండర్ మరియు జీవో నెంబర్ 39 కాఫీల ప్లకార్డులతో నిరసన కార్యక్రమంతో తెలియజేశారు. ప్రతియేటా స్పెషల్ డిఎస్సి తీస్తామన్నారు అలాగే రెండు సంవత్సరాలకొకసారి మెగా డీఎస్సీ తిస్తామన్నారు దానిపై స్పష్టత లేదు, ఇటువంటి జాబ్ క్యాలండర్ విడుదల చేసి  నిరుద్యోగ యువతీ యువకులకు, అలాగే గ్రూప్ -1 గ్రూప్-2  ప్రిపేర్ అవుతున్నటువంటి వారి ఆశలపై నీళ్లు చల్లారు తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ ని రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని అరకు పార్లమెంట్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో  దుడ్డు వినోద్ కుమార్ కార్యనిర్వాహక కార్యదర్శి, నందిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Jobless calendar should be canceled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *