ఐ.టి.ఐ  విధ్యార్ధులకు ఉద్యోగవకాశాలు:సిఎస్ జోషి

Jobs for ITI Students: CS Joshi

Jobs for ITI Students: CS Joshi

 Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు
రాష్ట్రంలోని ఐ.టి.ఐ ల లో విద్యనభ్యసించే విధ్యార్ధులకు మంచి ఉద్యోగవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో కార్మిక, ఉపాధి శాఖ  కార్యకలాపాలపై సమీక్షించారు.ఈ సమావేశంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ , కమీషనర్ నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. 291 ఐ.టి.ఐల లో 73 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారని, 16 ఐ.టి.ఐ లు ప్రముఖ సంస్థలతో  ఎంవోయూ లు కుదుర్చుకున్నాయని తెలుపుతూ నాణ్యమైన శిక్షణ ద్వారా మంచి సంస్థలలో ఉద్యోగాలు పొందేలా చూడాలన్నారు. సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ది చేయాలన్నారు. నాణ్యతపరంగా ఐ.టి.ఐ లకు గ్రేడింగ్ ఇవ్వాలన్నారు.వివిధ పరిశ్రమలతో ఐ.టి.ఐ లను అనుసంధానం చేయాలని, స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ లో బాగంగా 8993 మంది కి శిక్షణను ఇచ్చామని, రాష్ట్ర స్థాయి కౌన్సిల్ ను ఏర్పాటు చేశామని , జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ రీ ఇన్ వెంట్ చేయాలని, టెక్నాలజీని వాడుకుని నిరుద్యోగుల వివరాలు సేకరించాలని, పరిశ్రమల తో నిరంతరం అందుబాటులో ఉండి ఎక్కవ మందికి ఉద్యోగాలు లభించేలా కృషిచేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ప్రత్యేక హెల్త్ స్కీమ్ ను 15 రోజుల్లోగా రూపొందించాలని సి.యస్ ఆదేశించారు. రాష్ట్రంలో 10.62 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిష్టర్ చేసుకున్నారని ఇప్పటి వరకు 13,883 మందికి 54.91 కోట్లు అందించామన్నారు. ఇప్పటి వరకు రిజిష్టర్ చేసుకోని భవన నిర్మాణాల కార్మికులకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇ.ఎస్.ఐ హాస్పిటల్స్ పనితీరును సమీక్షించారు. అవసరమైన డాక్టర్ల నియామకం పై ప్రతిపాదనలు పంపాలన్నారు. వెల్ఫేర్ బోర్డుల విభజనపై అధికారులతో సమీక్షించారు.
ఐ.టి.ఐ  విధ్యార్ధులకు ఉద్యోగవకాశాలు:సిఎస్ జోషి https://www.telugumuchatlu.com/jobs-for-iti-students-cs-joshi/
Tags:Jobs for ITI Students: CS Joshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *