కండలేరు ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి

-. డి ఆర్ ఓ చిన్న ఓబులేష్  కి వినతి పత్రం

నెల్లూరు ముచ్చట్లు:

 

కండలేరు ముంపు నిరుద్యోగులకు సిద్ధంగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బిజెపి సీనియర్ నాయకులు, తెలు గంగజల హక్కుల కమిటీ కన్వీనర్ రమేష్ పేర్కొన్నారు .గురువారం కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేష్ కి ఆయన వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ కండలేరు ముంపు నిరుద్యోగులు కొరకు ఉద్యోగ సదుపాయాల జాబితా తయారుచేసి, 2 సంవత్సరాలు పూర్తయిందన్నారు. కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ జాబితా పంపనందువలన 2 సంవత్సరాల సీనియార్టీని నిరుద్యోగులు కోల్పోయారన్నారు. 788 రోజులుగా ముంపు నిరుద్యోగుల ఫైలు కలెక్టరేట్ లోనే పెండింగ్లో ఉందన్నారు. కండలేరు ముంపు గ్రామాల్లోని అవార్డులన్నీ పరిశీలించి , తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.

 

 

 

1990 సంవత్సరంలో కొంతమందికి ఉద్యోగ కల్పన చేశారని, 2007లో ముంపు నిరుద్యోగుల అవార్డులు సేకరించి మూడు సంవత్సరాలు దర్యాప్తు జరిపి 2010లో మొదటి జాబితా, 2012లో రెండవ జాబితా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. దీనికి అనుగుణంగా సీనియార్టీ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నారన్నారు. గతంలో 15 సంవత్సరాలుగా పనిచేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల పరిగణలోనికి తీసుకోకుండా ,కండలేరు ముంపు గ్రామాల్లోని అవార్డు దారులను మరోమారు గుర్తించాలంటే కనీసం పది సంవత్సరాలు పడుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలను గౌరవించి వెంటనే కలెక్టర్ కార్యాలయంలో రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 23 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు .

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Jobs for the unemployed should be replaced immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *