పుంగనూరు నిరుద్యోగులకు ఆర్మీలో ఉద్యోగాలు- సీఈవో ప్రభాకర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

భారతసైన్యంలో పుంగనూరు నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించేందుకు తిరుపతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు జెడ్పిసీఈవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట మైదానంలో ఉద్యోగమేళా నిర్వహించేందుకు జెడ్పిమాజీ వైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మంత్రి పిఏ మునితుకారం తో కలసి మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఆర్మీలోని ఉద్యోగాలకు ఎంపిక కాబడిన పుంగనూరు నియోజకవర్గంలోని వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మనోహర్‌, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, అంజిబాబు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Jobs in the Army for Punganur Unemployed- CEO Prabhakar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *