భారత్ కు జో బైడన్
వాషింగ్టన్ ముచ్చట్లు:
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది.భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో జీ 20 (G20) దేశాధినేతల సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా జీ 20 (G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. భారత్, అమెరికా సంబంధాల విషయంలో 2023 గొప్ప సంవత్సరంగా నిలవబోతోందని పేర్కొంది. జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సును భారత్ గొప్పగా నిర్వహించిందని ప్రశంసించింది.
2023 గొప్ప సంవత్సరంగా చరిత్రలో నిలవబోతోందని అమెరికా పేర్కొంది. ‘‘జీ 20 (G20) సదస్సును భారత్ నిర్వహిస్తోంది. ఒపెక్ సదస్సు అమెరికాలో జరగబోతోంది. జపాన్ జీ 7 సదస్సు నిర్వహిస్తోంది. మన క్వాడ్ దేశాలు నాయకత్వ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తున్నాయి. తద్వారా ఈ దేశాలన్నీ మరింత సన్నిహితమవుతున్నాయి’’ అని పేర్కొంది. భారత్ లో తాను జరపబోయే పర్యటన కోసం తమ అధ్యక్షుడు జో బైడెన్ ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

Tags: Joe Biden to India
