జో బైడెన్‌ కొత్త కాన్సెప్ట్

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తన పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా ఈ భేటీ ఏర్పాటు కానుంది. మోడీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌తోనూ సమావేశమౌతారు. వర్చువల్ విధానంలో ఈ సమావేశం ఏర్పాటవుతుందని వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ భేటీకి ఐ2యూ2 (I2U2)గా పేరు పెట్టినట్లు తెలిపింది. ఐ2యూ2లో.. ఐ అనే అక్షరం ఇండియా, ఇజ్రాయెల్‌ను సూచిస్తాయి. యూ అనే అక్షరం యూఎస్ఏ, యూఏఈని ప్రతిబింబిస్తాయి. గత ఏడాది అక్టోబర్‌లో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ సమావేశం ప్రతిపాదనకు వచ్చింది. జైశంకర్ సహా మిగిలిన మూడు దేశాల విదేశీ మంత్రులు ఐ2యూ2 భేటీకి అంగీకరించారు. అబ్రహం ఒప్పందం ప్రకారం.. ఈ ఫోరమ్ ఏర్పాటు కావాల్సి ఉంది. కాస్త క్షీణించిన కొత్త కరోనాకేసులు; తాజాగా 6,594కేసులు, 50వేలను దాటిన యాక్టివ్ కేసులు!! ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ కోసం అప్పట్లో జైశంకర్.. ఇజ్రాయెల్ పర్యటన కొనసాగింది. ఈ సారి ఇదే కాన్సెప్ట్‌తో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా- జో బైడెన్ వచ్చే నెల 13 నుంచి 16వ తేదీ వరకు పశ్చిమాసియా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఇజ్రాయెల్ సందర్శన సందర్భంగా జో బైడెన్ పలు కీలక అంశాలపై చర్చిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, బహ్రెయిన్‌ దేశాధినేతలో సంప్రదింపులు జరుపుతారు. Ads by భారత్-అమెరికా-ఇజ్రాయెల్-యూఏఈ ఒకే వేదిక మీదికి రావడం ఇదే తొలిసారి. మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఫుడ్ సెక్యూరిటీ, .. వంటి కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. అబ్రహం అకార్డ్స్‌లో భాగంగా ఈ భేటీ ఉంటుందని, పశ్చిమాసియా రీజియన్‌లో పరస్పర సహకారాలను పెంపొందించే దిశగా మరో ముందుడుగు పడినట్టవుతుందని వ్యాఖ్యానించింది. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో జో బైడెన్ పశ్చిమాసియా దేశాల పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రీజియన్‌లో రష్యాకు గట్టి మద్దతు ఉన్న విషయం తెలిసిందే. భారత్.. సుదీర్ఘకాలంగా రష్యాకు మిత్రదేశంగా ఉంటోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది.

 

Tags: Joe Biden’s New Concept

Post Midle
Post Midle
Natyam ad