మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో టిడిపినుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక
చౌడేపల్లె ముచ్చట్లు:
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీను విడిచి వైఎస్సార్‌సీపీలోకి టిడిపి మైనార్టీ నాయకుడు ఖాన్‌సాబ్‌మిట్టను కుచెందిన నూరుల్లా అనుచరులు 50 మందితో కలిసి సోమవారం వైస్సార్‌సీపీలోకి చేరారు. తిరుపతిలోని మంత్రి స్వగృహంలో నూరుల్లా మంత్రి తో కలిశారు. ఆయనతో పాటు అతనికుటుంభీకులు, అనుచరులు మహమ్మద్‌రఫి,సయ్యద్,ఖాదర్ భాషా,అప్రీద్,రేష్మా,ఫరీధా,షాహీదా,లతోపాటు మరో 40 మంది కి మంత్రి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్దిరెడ్డి వెంట నడవాలని నిర్ణయించుకొన్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్షిషలు కృషిచేస్తానని మైనార్టీనేత నూరుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు అంజిబాబు, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, మాజీ ఎంపీపీ రుక్మిణ మ్మ,సర్పంచ్‌లు షంషీర్, వరుణ్, పీహెచ్‌సీ కమిటీ చైర్మన్ కళ్యాణ్,రశీదా బేగం, అజీజుల్లా , కోఆప్షన్ మెంబరు సాధిక్ భాషా నాయకులు రవికుమార్‌రెడ్డి,రాధాపతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Joining YSRCP from TDP in the presence of Minister Peddireddy
