Natyam ad

బీజేపీలో చేరికలు

మేడ్చల్ ముచ్చట్లు:


మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలో టిఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. ఘట్ కేసర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఆవుషాపూర్ గ్రామ సర్పంచ్ కావేరి మచ్చెందర్ రెడ్డి .బీజేపీ లో చేరికపై క్లారిటీ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై పలు మార్లు వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్న మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల ఎంపీపీ, స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డిని, ఆవుషాపూర్ గ్రామంలో ఎంపీపీ నివాసానికి  హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వెళ్లి కలిసారు. వారం రోజుల్లో ఘట్ కేసర్ లో భారీ సభ ద్వారా ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి, తదితర టిఆర్ ఎస్ నాయకులు చేరనున్నారని సమాచారం.

 

Tags: Joins BJP

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.