ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: కోమటిరెడ్డి

Date:19/07/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేసారు. శుక్రవారం అసంబ్లి ఆవరణ లో మీడియా తో మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని,వెంటనే  సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. 3 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారని కానిఇప్పటివరకు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.మల్లన్న భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగా న్యాయం చేయాలని కోరారు. ఎన్నికలు వస్తేనే పథకాలు అమలు అవుతున్నాయన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదు.

 

 

 

వంద కోట్లు మంజూరు చేస్తే శివన్న గూడం,కృష్ణ రాంపాల్లి ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చునన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం చేసే పనికి సహకరిస్తామన్నారు. భట్టి విక్రమార్కను సభలో మాట్లాడనియకపోవడం బాధాకరమన్నారు.

 

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

Tags: Joint Nalgonda district should be declared a drought district: Komatireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *