ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ను  సన్మానించిన జర్నలిస్ట్ నేతలు

Date:11/08/2018
కర్నూలు ముచ్చట్లు:
మాజీమంత్రి, కర్నూలు జిల్లా స్థానిక సంస్థలఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ జా ప్  నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో రెండవ పెద్ద జర్నలిస్టుల సంఘం ఐన జా ప్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ కర్నూలు లో జా ప్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, గౌరవ అధ్యక్షులు విజయ్ తదితర జర్నలిస్టులతో కలిసి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ను శాలువకప్పి, జా ప్ సిల్వర్ జూబ్లీ వేడుకల మెమోంటో ఇచ్చి సత్కరించారు.  ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలు  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు  కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్ట్ లు,జా ప్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.
Tags:Journalist Leaders who are praised by MLC KE Prabhakar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *