అనంతపురం డీఆర్‌వో కార్యాలయం వద్ద 14న జర్నలిస్ట్ మచ్చారామలింగారెడ్డి అమరణ నిరాహరదీక్ష

Journalist Mangarajalinga Reddy's Amnesty Disappointment at Anurapuram Deora office

Journalist Mangarajalinga Reddy's Amnesty Disappointment at Anurapuram Deora office

Date:25/02/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం D.R.O కార్యాలయం ముందు APUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని.. APUWJ అనంతపురం జిల్లా కమిటీ నిర్ణయం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంత వరకైనా పోరాడుతానని స్పష్టం చేసిన మచ్చా రామలింగారెడ్డి. మూడు పడకల గదుల ఇళ్ల  నిర్మాణాలు త్వరగా చేపట్టేందుకు మచ్చా రామలింగారెడ్డి “ఆమరణ నిరాహారదీక్ష” చేపట్టాలని, APUWJ జిల్లా కార్యవర్గం, జర్నలిస్టులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.          జిల్లాలో ఉన్న 2000ల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లతో, రేషన్ కార్డులతో, సంభంధం లేకుండా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇంటి పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం చేపట్టాలనని, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలు, ఉద్యమాన్ని ఉధృతంగా చేపట్టాలని సభ్యుల డిమాండ్.                కోడిమి జర్నలిస్ట్ కాలనీను  మోడరన్ కాలనీ గా చేయాలని నిర్ణయం. రాబోవు బడ్జెట్లో జర్నలిస్టుల కోసం మూడు పడకల ఇళ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి G.O ని వెంటనే ఇవ్వాలని నిర్ణయం.                    మార్చి ఒకటో తేదీన జిల్లాలోని అన్ని తహశీల్దార్,R.D.O కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని….. ఆలాగే మార్చి 5వ తేదీన జిల్లాలోని అన్ని తహసీల్దార్, R.D.O కార్యాలయాల ఎదుట  నిరహదీక్షలు ఒక్క రోజు చేపట్టాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి మార్కండేయులు, ప్రభాకర్ నాయుడు, లక్ష్మి నారాయణ, చౌడప్ప, వీరాశేఖర్ రెడ్డి, లోకరాజు, గిరి, గోవిందప్ప, ప్రసాద్, ఆనంద్ కుమార్, నవీన్ కుమార్, సోమశేకర్, రాము, రామాంజనేయులు, శ్రీనివాసరాజు, ముస్కిన్, సతీష్ కుమార్, రామమూర్తి, గురుస్వామి, విజయరాజు, శ్రీధర్ మూర్తి, నాగరాజు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు .

 

Tags: Journalist Mangarajalinga Reddy’s Amnesty Disappointment at Anurapuram Deora office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *