జర్నలిస్ట్ మహమ్మద్ సలీముద్దీన్ ఆకస్మిక మృతిఅల్లం సంతాపం

Journalist Mohammed Salimuddin sudden death mourning

Journalist Mohammed Salimuddin sudden death mourning

Date:14/09/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సలీముద్దీన్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర  మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలిపారు. ఆయన  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీడియా అకాడమీ తరఫున సలీముద్దీన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. నల్లగొండలో పుట్టిన సలీముద్దీన్ జర్నలిజం వృత్తిలో ప్రవేశించి సీనియర్ జర్నలిస్టుగా రాణించారని అన్నారు.  ఆంధ్ర ప్రభ, సూర్య దినపత్రికలో పనిచేసిన అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభం నుండి ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేశారని తెలిపారు. ఆయన అర్దాంతరంగా వెళ్లిపోవడం బాధాకరమని అన్నారు.
Tags:Journalist Mohammed Salimuddin sudden death mourning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *