కేరళ కొత్త ఆరోగ్య మంత్రి గా జర్నలిస్ట్ వీణా జార్జ్!

కేరళ ముచ్చట్లు :

 

1976 ఆగస్ట్ 3 న తిరువనంతపురం లో జన్మించిన వీణ ఎమ్మెస్సీ ఫిజిక్స్ లో స్టేట్ ర్యాంకర్. బి.ఇడి కూడా చేశారు.24 వ ఏట టీవీ జర్నలిజం లో ప్రవేశించి, కైరళి, మనోరమ, టివి న్యూస్, లాంటి ప్రైమ్ చానళ్లలో యాంకర్ గా, న్యూస్ ఎడిటర్ గా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేశారు. కేరళ జర్నలిజం లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హోదా పొందిన తొలి మహిళా జర్నలిస్టు వీణ!విద్యార్థి గా ఎస్.ఎఫ్.ఐ. లో ఉన్న వీణ 16 ఏళ్లు టీవీ జర్నలిస్టుగా పనిచేశారు.పార్టీ అభ్యర్థన పై 2016 లో సి.పి.ఎం. టిక్కెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2021 ఎన్నికల్లో రెట్టింపు మెజారిటీతో మళ్లీ గెలిచారు.ఆమె భర్త జార్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో అధ్యాపకుడు. వారికి ఒక పాప,ఒక బాబు. 44 ఏళ్ల వయసులో ఆమె కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్ట పోతున్నారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Journalist Veena George appointed new Kerala Health Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *