-జెడ్పి చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Date:16/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
ప్రజలకు, ప్రభుత్వానికి వారదులుగా పాత్రికేయులు పనిచేస్తున్నారని జగిత్యాల జిల్లా పరిషద్ అధ్యక్షురాలు దావా వసంత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి లు అన్నారు. శనివారం జగిత్యాలలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పక్షాన ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్సీ లు ఆవిష్కరించారు. ఈసందర్బంగా వసంత మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పాత్రికేయులు వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంతే గాకుండా అభివృద్ధి, సంక్షేమంలో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారమార్గం చూపాలన్నారు. జర్నలిస్ట్ పక్షాన సమస్యల సాధన కోసం నావంతు పాటుపడతానన్నారు. కార్యక్రమంలో ఏడబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులు ఎద్దండి ముత్యపు రాజు రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కడకుంట్ల జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెండెం మహేందర్, జిల్లా నాయకులు చింతకుంట సాయి కుమార్, చెలిమెల మల్లేశం, కళ్లెం శ్రీనివాస్, బోయినపెల్లి రమేష్, వెంకటస్వామి, విజయ్ కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Journalists are bridges to the people, to the government