పోలీసుల అదుపులో విలేకర్లు

Date:25/05/2018
ఖమ్మం  ముచ్చట్లు:
 బెదిరింపులతో అక్రమ వసూళ్ళలకు పాల్పడుతున్న  విలేకర్ల ను టాస్క్ ఫోర్స్ , ఖమ్మం ఆర్బన్ పోలీసులు ..అదుపులోకి  తీసుకొన్నారు. సత్తుపల్లి దగ్గర గంగారం గ్రామంలో ఒక బియ్యం లారీని విలేఖరులమని కొందరు పట్టుకున్ఆరు. లారీ యజమానిని రెండు లక్షల రూపాయలను ఇవ్వాలంటూ లారీ డ్రైవర్ ను ఆధీనంలో వుంచుకొని  ఫోన్  చేసారు. దాంతోపాటు  ఓనరు ను డబ్బులకోసం బలవంతం చేసారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. లారీ ఓనరు తో నిందితులతో మాట్లాడించారు.  అడిగిపడబ్బు తీసుకునేందుకు ఖమ్మం  రాగా  టాస్క్ ఫోర్స్ , అర్బన్ పోలీసులు కలిసి వలపన్ని పట్టుకున్నారు. పట్టుకున్న వారిలో తోట కిరణ్ మనం దినపత్రిక , వి.సురేష్ కుమార్ నమస్తే తెలంగాణ  విలేకరి,  విలేకరి వీ6 న్యూస్ ఫజల్ వుండగా,  మరో ముగ్గురు పరారిలో వున్నారు .  రోడ్డు మీద వెళుతున్న లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు మేరకు  వీరిపై నిఘా పెట్టి ఖమ్మం ఆర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని   శ్రీ శ్రీ  సర్కిల్  సమీపంలో  అదుపులోకి తీసుకున్నారు.
Tags:Journalists in police custody

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *