పవన్ వ్యాఖ్యలకు జర్నలిస్టుల నిరసన

Journalist's protest to Pawan's comments

Journalist's protest to Pawan's comments

Date:21/04/2018
విజయవాడ ముచ్చట్లు: 
జనసేనాని పవన్ కళ్యాణ్  మీడియా పై చేసిన వాఖ్యలకు నిరసనగా బెజవాడలో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని బెంజి సర్కిల్ లో జర్నిలిస్టులు చేపట్టిన ఆందోళనకు  వివిధ వర్గాల నుంచి  మద్దతు లభించింది.  మీడియా మిత్రులకు సంఘీబావంగా ఏపీ ఎన్జీవోలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు నిరనస కార్యక్రమంలో పాల్గోన్నారు. తొలుత ధర్నా నిర్వహించిన మీడియా సిబ్బంది అనంతరం బెంజి సర్కిల్ చుట్టూ కొద్దిసేపు మానవహారం చేసి నిరసన తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ జర్నిలిస్టు ఫోరమ్, ఎపీయూడబ్ల్యు , ఏపీ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ,జాప్ తదితర మీడియా ఆసోసియోషన్ ల ప్రతినిధులు పవన్ వాఖ్యలను ఖండించారు. మరోవైపు పవన్ అభిమానులు మీడియా వెహికల్స్ ను ద్వంసం చేయడాన్ని తప్పుబట్టారు.   ఏ.పి.జె.ఎప్. రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ తమ వాఖ్యలను వెంటనే ఉపసంహారించుకోవాలని సూచించారు. ఒక మహిళా జర్నిలిస్టుపై దాడికి దిగిడం సమజసమా అంటూ ప్రశ్నించారు.  మీరు సినీ నటుడు కాదు.  ఒక పార్టీకి అధ్యక్షుడుగా ప్రజా జీవితంలోకి వచ్చారు. అలాంటప్పుడు మీరు ఎంతో సంయమనం పాటించాల్సి ఉంది… కాని . మీరు తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎ.పి.జె.ఎప్. నాయకులు డిమాండ్ చేసారు. ఎ.పిజర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు వలీ మాట్లాడుతూ మీడియాపై దాడులను ఖండించారు.  నలుగురికి చెప్పాల్సిన పవన్ అభిమానులకు పిలుపు ఇవ్వడం కొన్ని చానల్స్ ను చూడొద్దూ అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్టని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అద్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ మీరు మీటింగ్ పెట్టినా, మీ పార్టీకి సంబంధిచిన అంశాలను ఇదే మీడియా ప్రచారం కల్పించిదన్న విషయం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు పవన్ ఇలా వ్యవహారించడం కరెక్టు కాదని అన్నారు. జాప్ నాయకులు రాజారమేష్, ఏపీజేఎఫ్ నాయకులు బ్రహ్మయ్య, ఏపీయూడబ్ల్యుజె నాయకులు జయరాజ్, చలపతిరావు, వివిధ  ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాపర్స్, వీడియో జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గోన్నారు.
TAgs:Journalist’s protest to Pawan’s comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *