12 నుంచి జగన్ యాత్ర

Journey from 12th

Journey from 12th

Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నంతో ఆయన తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. గత నెల 25న విశాఖపట్నంలో ఆయనపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో జగన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఆయన కోలుకోవడంతో తిరిగి ‘ప్రజా సంకల్ప యాత్ర’ను పున: ప్రారంభించనున్నారు. వాస్తవానికి నవంబర్ 3 నుండే పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా.. ఆరోగ్యపరమైన కారణాలతో మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు జగన్. అయితే భుజం గాయం నుండి పూర్తిగా కోలుకున్న జగన్ ఈ నెల 12 సోమవారం నుండి ప్రజా సంకల్ప యాత్రను పున: ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సిఉంది.
Tags: Journey from 12th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *