Natyam ad

జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు

పోలీసుల కస్టడికి ప్రధాన నిందితుడు

హైదరాబాద్ ముచ్చట్లు:


జూబ్లీహిల్స్  అఘాయిత్యం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్(18)ను పోలీసులు మూడు రోజులపాటు  కస్టడీకి తీసుకున్నారు. నిందితుడిని శనివారం వరకు విచారించనున్నారు. ముందుగా బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీసుకు తరలించారు. తరువాత  పబ్లోకి ఎంట్రీ దగ్గర్నుంచి ఇన్నోవా కారులో జరిగిన ఘటన వరకు జరిగిన వ్యవహారాన్ని విచారించారు.
మరోవైపు, ఇన్నోవా వాహానాన్ని వక్ఫ్ బోర్డు చైర్మన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏలో 2019 సెప్టెంబర్ 23న రిజిస్టర్ చేసినట్లుగా రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. టీఎస్ 09 ఎఫ్హెచ్ 3786 నంబర్తో గల ఈ కారు ‘దినాజ్ ’ అనే మహిళ పేరుతో రిజిస్టర్ అయింది. ఇదే కారును గత ఏడాదిన్నర కాలంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఫ్యామిలీ ఉపయోగించినట్లు గుర్తించారు. బాలికపై అఘాయిత్యం జరిగిన రోజు వక్ఫ్బోర్డు చైర్మన్ కొడుకు అదే ఇన్నోవాలో పబ్కి వెళ్లినట్లుగా ఆధారాలు సేకరించారు.  తాజాగా జూబ్లీ హిల్సీ్ పోలీసులు మైనర్ నిందితులను కేసు విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టీస్ బోర్డును కోరారు. చార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత జరిగే కేసు విచారణ కాలంలో ఐదుగురు మైనర్ నిందితులను మేజర్లుగా చూడాలని కోరారు.

 

Post Midle

Tags: Jubilee Hills gang rape case

Post Midle