Judge Ara on Corona Prevention Measures

కరోనా నివారణ చర్యలపై న్యాయమూర్తి ఆరా

Date:28/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

కరోనా వైరస్‌తో ముప్పు వాటిల్లకుండ ప్రజలకు అందిస్తున్న చర్యలపై సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కమిషనర్‌ కెఎల్‌.వర్మతో మాట్లాడారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ మున్సిపాలిటిలో చేపడుతున్న నివారణ చర్యలు గురించి న్యాయమూర్తికి వివరించారు. అలాగే కమిషనర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ గాలిలో కలిసిపోతోందన్న వార్తలు వెలువడుతున్నందున ప్రజలందరు తమ తమ ఇండ్ల వద్ద ఉండిపోవాలని పట్టణంలో మైకులతోను, అలాగే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో ఇంటింటా ప్రచారం చేపట్టామని తెలిపారు. పట్టణంలో హైడ్రోక్లోరైడ్‌ మందును గాలిలోకి స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని 31 వార్డుల్లోను ట్యాంకర్ల స్ప్రేయర్లతో పిచికారి చేస్తామన్నారు. నాలుగు వారాలు పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ పోలీస్‌, రెవెన్యూతో కలసి నివారణ చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నడు లేని విధంగా న్యాయమూర్తులు సైతం కరోనా వైరస్‌పై విచారణ చేయడంపై వ్యాది తీవ్రత ఎంతో ఉందో తెలుసుకుని, ప్రజలు సహకరించి, ఇండ్లలో ఉండిపోవాలని కమిషనర్‌ సూచించారు.

చేతులతో మోసుకుని కుమారుడి ఖననం

Tags: Judge Ara on Corona Prevention Measures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *