శ్రీమఠంలో ముంబై హైకోర్టు న్యాయమూర్తి
మంత్రాలయం ముచ్చట్లు:
రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శనార్థం ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఆర్ శ్రీరామ్ కుటుంబ సమేతంగా శనివారం మంత్రాలకు వచ్చారు. వీరికి శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే .శ్రీనివాసరావు అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి వేద పండితులు శ్రీమఠం సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి కే.ఆర్. శ్రీరామ్ ఆయన సతీమణి ఉషా శ్రీరామ్ దంపతులకు మేనేజర్ శాలువా మెమెంటో ఫలమంత్ర అక్షింతలు అందజేశారు .అనంతరం శ్రీమఠంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించి చెప్పారు. ఆరాధన ఉత్సవాల కల్లా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తవుతాయని ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు.

Tags: Judge of Mumbai High Court in Srimath
