జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన తల్లితో కలిసి కర్ణాటకలో

కర్ణాటక ముచ్చట్లు:

 

కుందాపుర ఎన్టీఆర్ అమ్మమ్మ  ఊరు.తల్లి కోరిక మేరకు కుందాపుర వచ్చిన ఎన్టీఆర్… ఉడుపి జిల్లాలోని శ్రీకృష్ణ మఠ ఆలయాన్ని దర్శించారు.కన్నడ స్టార్ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టితో కలిసి ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను స్థానిక మీడియా ప్రతినిధులు కన్నడ భాషలో ప్రశ్నలు అడగ్గా… ఆయన పూర్తిగా కన్నడలోనే బదులివ్వడం విశేషం.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.తెలుగును ఎంత అలవోకగా మాట్లాడతారో, అదే రీతిలో ఎన్టీఆర్ కన్నడ భాషను మాట్లాడడం ఈ వీడియోలో చూడొచ్చు.కాగా, ఎప్పటి నుంచి కుందాపుర, ఉడుపి రావాలనుకుంటుంటే, ఇన్నాళ్లకు కుదిరిందని తెలిపారు.తన తల్లి 40 ఏళ్లుగా ఉడుపి ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటోందని, ఇవాళ వచ్చామని, ఇది కృష్ణుడి స్క్రీన్ ప్లే అని ఎన్టీఆర్ చమత్కరించారు.ఈ పర్యటనలో తమ వెంట తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు, దేవుడు ఇచ్చిన స్నేహితుడు రిషబ్ శెట్టి ఉండడం ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు.దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తమ వెంట ఉన్నారని వెల్లడించారు.కుందాపుర తన తల్లి పూర్వీకుల గ్రామం అని తెలిపారు.దేవుడ్ని ఏం కోరుకున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా… మనశ్శాంతి కోరుకున్నానని జవాబివ్వగానే అందరూ నవ్వేశారు.సర్వే జనా సుఖినోభవంతు అనేది తన నినాదం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.కాగా, ఇవాళ బెంగళూరు ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ కు రిషబ్ శెట్టి హార్దిక స్వాగతం పలికారు.ఎన్టీఆర్ తల్లి శాలినికి రిషబ్ శెట్టి పాదాభివందనం చేశారు.

Tags: Junior NTR is in Karnataka with his mother today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *