జూపల్లి ఆరోగ్యం కోసం పూజలు

Date:26/08/2020

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కరోనా వైరస్ బారీ నుండి త్వరగా కోలుకోవాలని  రామమందిరంలో బుధవారం  ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు,   అభిమానులు, జూపల్లి యువసేన కార్యకర్తలు,  బోరెల్లి మహేష్ మాట్లాడుతూ కోన్ పూస్తే హై  కొల్లాపూర్ అనే స్థాయి నుండి ఇప్పుడు కొల్లాపూర్ అన్ని విధాలుగా టూరిజంలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఘనత జూపల్లి కి చెందుతుందని అన్నారు. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో తాగు,సాగు నీరు అందించి రైతులకు ఎనలేని కృషి చేసినటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం వదిలి పెట్టినారని వఅన్నారు. అయన  రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో వారి త్యాగం చిరస్మరణీయమని అన్నారు. అదేవిధంగా అయన ఆరోగ్యం పట్ల రామ మందిరంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారిపట్ల దైవ అనుగ్రహంతో త్వరలో తిరిగి ఆయురారోగ్యాలతో ప్రజల్లోకి వచ్చి ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, కౌన్సిలర్ నయీమ్,కిషోర్, కిరణ్, బాబా, దిలీప్శెట్టి, అభిలాష్ గౌడ్, లింగం నాయుడు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పారదర్శకంగా రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

Tags;Jupali is a puja for health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *