Natyam ad

జూపల్లి వర్సెస్ నిరంజన్

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పంజరం నుంచి బయటపడినంత సంతోషంగా ఉందన్నారు. తనకు పార్టీలో సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదని, రాజశేఖర్‌ రెడ్డి ఫోటో పెట్టుకోడాన్ని ప్రశ్నించే నీచ స్థాయికి బిఆర్‌ఎస్‌ పార్టీ దిగజారిపోయిందన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి జూపల్లిని సస్పెండ్ చేసిన వ్యవహారం మంత్రి నిరంజన్‌ రెడ్డి, జూపల్లి మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. జగన్మోహన్‌ రెడ్డి కోసం తాను కూడా పదవికి రాజీనామ చేస్తానని జూపల్లి చెప్పారని, తెలంగాణ కోసం ఏనాడు రాజీనామా చేస్తాననలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.జూపల్లి ప్రజల కోసం అంకితమై పనిచేసినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం పనిచేసిన దానికంటే పార్టీ ఎక్కువగా గౌరవించిన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి, శత్రువని తెలిసిన తర్వాత కూడా జూపల్లి తన ఇంట్లో రాజశేఖర్‌ రెడ్డి ఫోటో పెట్టుకున్నారని ఆరోపించారుమంత్రిని చేసిన కేసీఆర్‌ ఫోటో పెట్టుకోని జూపల్లి రాజశేఖర్ రెడ్డి ఫోటో మాత్రం పెట్టుకున్నారని ఆరోపించారు.

 

 

 

తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే వారి మీద కేసులు పెట్టించి జైలుకు పంపారని, తెలంగాణలో దగ్గరుండి వైఎస్ విగ్రహాలు పెట్టించారని గుర్తు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా జూపల్లి పెట్టించలేదని విమర్శించారు.తెలంగాణ మీద అభిమానంతో ఓ ఉద్యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తే అతడిని జైలుకు పంపించాడని గుర్తు చేశారు. తన నియోజక వర్గంలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా జూపల్లి పెట్టించలేదన్నారు. తెలంగాణకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు మాట్లాడుతున్నారని, పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకున్నా నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు.తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల కోట్ల రుపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశారన్నారు. తెలంగాణ మాదిరి తలసారి ఆదాయం దేశంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. తెలంగాణ మాదిరి అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏదైనా ఉందా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.

 

 

 

Post Midle

నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు.అంతకు ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన జూపల్లిని అసెంబ్లీ అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు క్వార్టర్‌లో మీడియాను అనుమతించమని స్పష్టం చేశారు.బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు తనకు సంతోషంగా ఉందని జూపల్లి చెప్పారు. పంజరం నుంచి బయట పడ్డట్టు ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. తనకు పార్టీలో సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదని, రెండేళ్లుగా సభ్యత్వ నమోదుకు పుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వలేదన్నారు.మందిమాగదులతో ప్రెస్మీట్లు పెట్టించడం కాదని, కేసీఆర్‌ తన ప్రశ్నల్లో అబద్దాలు ఉంటే సమాధానం చెప్పాలని, తాను మాట్లాడిన వాటిని రుజువు చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. తన ప్రశ్నలకు భయపడి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో వారి బండారం బయటపడుతుందనే కారణంతోనే సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధర్మకర్తగా ఉండాలని, ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా ఉండాలని,

 

 

 

ప్రతి అంశంపై పారదర్శకంగా పాలన చేయడం ముఖ్యమంత్రి బాధ్యత అనే విషయాన్ని మరిచిపోయి, రాష్ట్రం నాది, నా ఇష్టం వచ్చినట్లు దానధర్మాలు చేస్తాను అన్నట్లు పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధనలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వాములు అయ్యారన్నారు. ఎంతోమంది బలిదానాలు చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందన్నారు.తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, మూడు పూటల తిండి తినాలి అనే కోరికతో ప్రాణ త్యాగాలు చేశారన్నారు. తనలా ఒక్కరు కూడా పదవిని విడిచి పోరాటం చేయలేదన్నారు. 2011 మార్చిలో సకల జనుల సమ్మెను రద్దు చేస్తున్నట్లు జేఏసీ ప్రకటించిందని, అదే రోజు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేశానని ఎగతాళి చేశారన్నారని జూపల్లి గుర్తు చేశారు.తెలంగాణ ప్రజా ప్రతినిధులు అరగంట కూడా పదవుల్ని వదిలి ఉండలేరని అప్పట్లో కావూరి విమర్శించారని, ఆ వార్తలు చూసి చలించి, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, పదవులు ఎందుకని భావించి అప్పటికప్పుడు పదవికి రాజీనామా ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. సిఎంకు రాజీనామా లేఖను ఇస్తే నీ రాజీనామాతో తెలంగాణ వస్తుందా అని తనను ప్రశ్నించారని,

 

 

 

మీ రాజీనామాలతో తెలంగాణ ఆగిందా లేదా అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదన్నారు.తనను ఏం కావాలో అడగమని సిఎం ఆఫర్ ఇచ్చారని, వెయ్యి కోట్లు కూడా తనను కొనలేరని చెప్పానన్నారు. ఆ తర్వాత జిల్లాలో పాదయాత్ర చేశానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు గుర్తు చేశారు. మూడున్నరేళ్ల పదవీ కాలాన్ని వదిలి పార్టీలో చేరానని చెప్పారు.రాజశేఖర్‌ రెడ్డి ఫోటో తన ఇంట్లో ఆ రోజు ఉంది, ఈ రోజు తనింట్లో ఉందన్నారు. నా ఇంట్లో ఎవరి ఫోటో ఉండాలో నా ఇష్టమన్నారు. ప్రతి వ్యక్తిలో మంచి చెడులు ఉంటాయన్నారు. కేసీఆర్‌ ఫోటో ఇప్పటికీ తన ఇంట్లో ఉందన్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు తమ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తాను మాట్లాడిన దాంట్లో తప్పేమి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం సమావేశంలో తానేమి తప్పు మాట్లాడలేదని స్పష్టం చేశారు. వనపర్తిలో రూ.5లక్షల పనికి రూ.70లక్షలు వసూలు చేసిన ప్రజా ప్రతినిధి మళ్లీ రూ.26కోట్లు కావాలని కోర్టుకు వెళ్లారని, కోర్టు బయట డబ్బు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని, అదెంత వరకు న్యాయమని ప్రశ్నించానన్నారు.అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగంలో లక్షా 80వేల కోట్లలో, లక్షా 20వేల కోట్లు చెల్లింపులు చేశారని, కాంట్రాక్టుల కేటాయింపుల్లో ఒక్క శాతం కూడా తగ్గించకుండా పనులు కేటాయించారని, ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ఈ డబ్బులు ఎవరికి కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు.

 

Tags:Jupally vs. Niranjan

Post Midle