Natyam ad

జైలులో న్యాయ విజ్ఞాన సదస్సు

కడప ముచ్చట్లు:


కడపలోని పురుషులు,  మహిళ కేంద్ర కారాగారంలో  శుక్రవారం నాడు చేసి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.  జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి కవిత ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం, న్యాయ సహాయం, రక్షణ సలహా వ్యవస్థ ను వివరించారు. పారా లీగల్ వాలంటరీలు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ విధి విధానాలు తెలియజేశారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవచ్చని అన్నారు.  ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ హరిబాబు మరియు ఖైదీలు పాల్గొన్నారు.

 

Tags:Jurisprudence Conference in Jail

Post Midle
Post Midle