Natyam ad

అప్పుడే… ఏం జరిగింది….

హైదరాబాద్ ముచ్చట్లు:

1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ నగరంలో అనేక ఘటనలు జరిగాయి. 2022 సెప్టెంబర్‌కు ఆ ఘటనలు జరిగి ఏడున్నర దశాబ్దాలు కావోస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటితరం.. అప్పుడు ఏం జరిగింది అనేదానిపై ఆసక్తి చూపిస్తున్నారు.”తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలనీ.. ఫ్యూడలిజం, రాచరికం పోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. సాయుధ పోరాటం విస్తృతమైంది. ౩వేల గ్రామాలు పార్టీ పలుకుబడిలోకి, ప్రజల ఆధీనంలోకి వచ్చాయి. మరోవైపు స్టేట్ కాంగ్రెస్ కూడా సత్యాగ్రహ పోరాటాలు చేసింది. సరిహద్దులో రేడియో స్టేషన్‌లు పెట్టారు.

 

 

 

మూకు దళాలు కూడా పనిచేశాయి. ఇది పరిమితమే కానీ.. మధ్య తరగతిని కొంతవరకు ప్రభావితం చేసింది.నిజాం రాజ్యంలోని ‘జలియన్‌ వాలా బాగ్‌’ ఘటనల్లో గుండ్రాం పల్లి ఒకటి. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపుటేరులు పారించారు. ఖాసీం రజ్వీకి అత్యంత సన్నిహితుడైన మక్బూల్‌ ఈ గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడు. గ్రామస్థులంతా ఏకమై తిరగబడ్డారు. పారిపోయిన మక్బూల్‌ రజాకార్ల మూకలతో తిరిగొచ్చి గ్రామం మీద పడ్డాడు. 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలోని బావిలో పడేశారు. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొని ఎత్తుకెళ్ళి పోయారు. అలాగే తెలంగాణ విమోచన పోరాటంలో బైరాన్‌పల్లి వీరత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజాకార్ల అరాచకాలను ఎదుర్కొ నేందుకు బైరాన్‌పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకుని, బురుజులు కట్టారు. బురుజులపై నుంచి నగారా మోగిస్తూ రజా కార్లతో పోరాడేందుకు గ్రామ రక్షక దళాలు సిద్ధమయ్యేవి. ఒకసారి బైరాన్‌పల్లి పక్క గ్రామం లింగాపూర్‌ పై రజాకార్లు దాడి చేసి, ధాన్యాన్ని ఎత్తుకెళ్తుండగా బైరాన్‌ పల్లి వాసులు అడ్డుకొని ఎదురు దాడి చేశారు.

 

 

 

Post Midle

దీంతో బైరాన్‌ పల్లిపై కక్షగట్టిన రజాకార్లు మొదటిసారి 60 మందితో, మరో సారి 150 మందితో దాడికి యత్నించి తోకముడిచారు. ప్రతీ కారేచ్ఛతో రగిలిపోయిన రజా కార్లు 400 మంది సైన్యంతో, మారణాయుధాలతో ఊరిపై పడ్డారు. మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. సంప్రదాయక ఆయుధాలతో ఎదురు తిరిగిన బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు మొత్తం 118 మంది వీరమరణం పొందారు. ఆనాటి వీరోచిత పోరాటాలకు బైరాన్‌పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలిచి ఉంది. 1947 సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ నినదించిన పరకాల గ్రామస్థులపై రజాకార్లు, నిజాం సైనికులు చేసిన దాడిలో 19 మంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జల్‌–జమీన్‌–జంగల్‌ కోసం పోరాడిన రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచ రులను నిర్మల్‌లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. ఆ మర్రి ‘గోండ్‌ మర్రి’, ‘ఉరుల మర్రి’, ‘వెయ్యి ఉరుల మర్రి’గా ప్రసిద్ధి చెందింది.తెలంగాణ విమోచన కొరకు అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల మంది ఉద్యమకారులపై నిజాం పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి సమీపంలోని రేణికుంటపై 1948 మార్చి 4న నిజాం పోలీసులు, రజాకార్‌ మూకలు లూటీకి తెగబడ్డారు. సంప్రదాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకున్న గ్రామస్థులు ఆధునిక ఆయుధాలున్న రజాకార్లను ప్రతిఘటించారు,

 

 

 

 

వారితో భీకరంగా పోరాడారు. ఈ పోరాటంలో 26 మంది రేణికుంట గ్రామస్థులు అమరులయ్యారు. నిర్హేతుక పన్నులపై గొంతెత్తి, పన్నులు కట్టమంటూ భీష్మించుకు కూర్చున్న పాతర్లపహాడ్‌ వాసులను నిజాం పోలీసులు ఊచకోత కోశారు. 17 మంది అమరులయ్యారు. జనగాం సమీపంలోని కాట్కొండలో రజాకార్ల బలవంతపు వసూళ్లను అడ్డుకున్న 13 మందిని కాల్చి చంపారు. కూటిగల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను కాల్చి చంపారు. 1935–47 మధ్యన, మరీ ముఖ్యంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్‌ వరకు ఇలాంటి హింసాత్మక ఘటనలు వంద లాదిగా జరిగాయి. జలియన్‌ వాలాబాగ్‌ ఘటన అనూహ్యంగా జరిగింది. కానీ నాటి హైదరాబాద్‌ సంస్థానంలో 13–14 ఏళ్ల పాటు వ్యవస్థీకృతంగా హిందువులపై రక్త పాతం జరిగింది. సర్దార్‌ పటేల్‌ చేపట్టిన ‘పోలీస్‌ యాక్షన్‌’తో దేశానికి స్వాతంత్య్రం లభించిన 13 నెలల తర్వాత 1948 సెప్టెం బర్‌ 17న ఈ ప్రాంతం నిజాం పీడ నుంచీ, రజాకార్ల అకృత్యాల నుంచీ విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్‌ 17న ఎలాంటి వేడుకలు జరపకుండా, ప్రాముఖ్యం లేని రోజుగానే చూశాయి.  స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్రం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో తెరమరుగైన యోధులకు గుర్తింపునిచ్చి స్మరించుకుంటోంది.

 

 

 

ఈ క్రమంలో తెలంగాణలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలో అసువులు బాసి, వెలుగులోకి రాని యోధులను, ఘటనలను వెలుగులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వ హించేందుకు సిద్ధమైంది. 2023 సెప్టెంబర్‌ 17 వరకు సంవత్సరం పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ ప్రాంత విమోచన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో నేటి తరం తెలుసుకోవాలన్నదే ఈ వేడుకల ఉద్దేశ్యం. ఇదే మన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించిన నాటి యోధులకు ఇచ్చే అసలైన నివాళి. చివరకు 1948  సెప్టెంబర్ 11న యూనియన్ సైన్యం.. హైదరాబాద్ సంస్థానంపై “పొలీసు ఆపరేషన్” పేరుతో జోక్యం చేసుకుంది. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను రక్షించింది. కానీ.. వెట్టిభాకం రద్దు చేసిన కమ్యూనిస్టులపై ఆపరేషన్ కొనసాగింది.దీంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీన చేస్తున్నామని ప్రకటించారు. ఇన్నేళ్ల తర్వాత ఇది విముక్తి పోరాటమని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఏ పదం పెడితే ఏముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు నాయకుల్లో.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తోపాటు.. మఖ్దూం మొహినోద్దీన్ ఉన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు.

 

Tags: Just then… what happened…

Post Midle

Leave A Reply

Your email address will not be published.