‘దిశ’ కు న్యాయం జరిగింది.. జనం హర్షాతిరేకాలు

Justice for the 'direction' .. the people Harshatirakes

Justice for the 'direction' .. the people Harshatirakes

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సరళ

Date:06/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు,సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిశిరాత్రిలో ఎక్కడైతే‘దిశ’ కాలిపోయిందో.. ఆమె ఆర్తనాదాలు నిశీధిలో ఘోషగా మారాయో.. ఆమె ఆత్మ శరీరాన్ని విడిచి మనోవేధనతో ఎక్కడైతే వెడలిపోయిందో.. అక్కడే ఆ చంపిన నలుగురు నిందితులు గాలిలో కలిసిపోయారన్నారు. 10 రోజుల‘దిశ’ హత్యోదంతంలో ప్రజలు కోరుకున్నదే జరిగిందని, మహిళలు నినదించిందే చోటుచేసుకుందని, పోలీసుల నిర్లక్ష్యంపై రాళ్లేసిన ప్రజలే ఇప్పుడు వారి చర్యపై పూలు జల్లుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారని ఇప్పుడు ‘దిశ’కు సరిఅయిన న్యాయం జరిగిందని ప్రజలందరు తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారన్నారు. అలాగే ఇక ముందు ఎక్కడయిన ఎవరయినా మగమృగాలు మహిళలపై ఇలా దుశ్చర్యలకు పాల్పడితే తగిన శిక్ష తప్పదని హెచ్చరికగా భావించాలని తెలిపారు. దిశకు ఇప్పుడు తగిన న్యాయం జరిగిందని.. అందుకు సంతోషం వ్యక్తం చేశారు.గోకుల్ సర్కిల్ నందు విద్యార్థిలతో కలసి టపాసులు పేల్చి తమ సంతోషాన్ని తెలియజేసారు.అలాగే పుంగనూరు ఎస్సై తిప్పేస్వామి మరియు పోలీస్ లను మా దిశ కు పోలీసు వ్యవస్థ తగిన న్యాయం చేసారని అభినందించి,స్వీట్లు చాక్లెట్స్ పంచి పెట్టారు.

 

పోలీసులకు మహిళా లోకం సలాం

 

Tags:Justice for the ‘direction’ .. the people Harshatirakes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *