నెల్సన్‌ మండేలా అవార్డ్‌’అందుకున్న జస్టిస్‌ జి.చంద్రయ్య

Date:20/11/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య ప్రతిష్టాత్మక ‘నెల్సన్‌ మండేలా అవార్డ్‌’అందుకున్నారు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఢిల్లీ నేషనల్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ఈ అవార్డును ఆయనకు అందించారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ హోదాలో జస్టిస్‌ చంద్రయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్‌సీయూఐ, ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

Tags: Justice G. Chandraya, recipient of the Nelson Mandela Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *