Natyam ad

ఏపీ నూతన సీఎస్ గా కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

అమరావతి ముచ్చట్లు :

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఈ నెల 30 న పదవీ విరమణ చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శి గా జవహర్‌ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉంది. అంటే మరో ఏడాదిన్నర పాటు ఆయన సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌ గా పదవీ విరమణ అనంతరం సమీర్‌ శర్మ ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ గా నియమించ నున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌ షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈ అండ్‌ జీ) వైస్‌ ఛైర్మన్‌ పోస్టు లోనూ ఆయనను ఇన్‌ఛార్జిగా నియమించ నున్నట్టు సమాచారం.కొత్త సీఎస్‌ గా నియమితులైన జవహర్‌ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.. ఆయన కంటే సీనియర్లు అయిన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్‌ వలెవన్‌ (1989) సీఎస్‌ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ మాత్రం.. జవహర్‌ రెడ్డి వైపే మొగ్గు చూపారు. వైకాపా అధికారం లోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌ రెడ్డి కి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే.. తితిదే ఈవో గా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే, సీఎంఓ లోకి తీసుకొచ్చారు. కొన్ని నెలల పాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ప్రస్తుతం సీఎంఓ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి.

 

Post Midle

Tags: K.S. as the new CS of AP. Jawahar Reddy.. Government issued orders..

Post Midle