ప్రాత కోట లో కబడ్డీ పెద్ద వృషభరాజుల పోటీలు

Date:16/01/2021

పగిడ్యాల ముచ్చట్లు:

అన్నపూర్ణ .విగ్నేశ్వర. నందీశ్వర. కాశీ ఈశ్వర. నాగేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో పేద్ద ఎద్దుల బండలాగుడు పోటీలు, కబడ్డీ పోటీలను జూపాడుబంగ్లా ఎస్ఐ, ముచ్చుమర్రి ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు. భక్త జన సందోహం సమక్షంలో ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడ పోటీలు మనిషి ఆరోగ్యానికే కాకుండా ఎంతో ఉత్సాహ పరుస్తాయన్నారు.తను ముచ్చుమర్రి స్టేషన్ ఎస్ఐ గా వచ్చి ప్రాత కోట గ్రామం లోని పవిత్ర దేవాలయాలలో మూడు సంవత్సరాల నుంచి విధులు నిర్వహించడం దేవుడు చేసిన శుక్రుతమని. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులు గ్రామ ప్రజలు కలిసికట్టుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తిరుణాల చేసుకోవడం సంతోషకరమైన విషయమని  ప్రాతకోట గ్రామంలో తిరుణాల జరిపించడం పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం కావున మూడు రోజుల నుండి ఘనంగా జరిపించడం జరిగింది.

 

 

గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ప్రశాంతంగా తిరుణాల మహోత్సవాలు జరుపుకోవడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. శనివారం నాడు పార్వేట జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు. ఎర్రం వెంకట్ రేడ్డీ. బీరవోలు వెంకటేశ్వర్లు. మసీదుల సుభాన్. హుస్సేన్ సాహెబ్. అంబటి శంకర్ రెడ్డి. సగినేల రమణ. కురుమన్న. ఘట్టన కొడుకు వెంకటేశ్వర్లు. విద్యా కమిటీ చైర్మన్ సిలార్ సాహెబ్. కుర్వ మల్లయ్య. సురేంద్ర. నారాయణ. జగన్. గజ్జెల గుర్రేరెడ్డి. డాక్టర్ నాగ శేషులు. పుట్టా రమణ ప్రసాద్. చిన్న స్వాములు. పల్లె బక్కన్న. రఘువీరారెడ్డి . గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Kabaddi big bull competitions in the old fort

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *