Natyam ad

పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా నిన్నటి నుండి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో 30 జ ట్లు పాల్గొన్నాయి. వాటిలో మొదటి బహుమతిగా కం గా నెల్లూరు 30 వేల రూపాయల నగదు బహుమతి మరియు ట్రోఫీ అందుకొన్నారు .అదేవిధంగా రెండో బహుమతిగా తమిళనాడుకు చెందిన పడయప్పన్ 20000 రూపాయలు నగదు మరియు ట్రోఫీ చేజికించుకున్నారు. అదేవిధంగా మూడో బహుమతి ఏడూరు పదివేల రూపాయలు నగదు బహుమతి పొందారు .ఈ బహుమతులన్నీ ఎన్విఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి  చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ జరగడానికి మాకు సహకరించిన పుంగనూరుకు చెందిన కబడ్డి అసోసియేషన్ వారికి మరియు ఎన్విఆర్ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి ,జైపాల్ రెడ్డి ,శంకర్ రెడ్డి ,చంద్రమోహన్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,నాగరాజు, వెంకటరమణారెడ్డి సందీప్ రెడ్డి ,మహేష్ రెడ్డి, నాగరాజు రెడ్డి ,పురుషోత్తం రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Kabaddi tournament in Punganur mandal Chadalla village

Post Midle

Leave A Reply

Your email address will not be published.