పుంగనూరులో కబడ్డీ శిక్షణ పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బసవరాజ మైదానంలో జరుగుతున్న కబడ్డీ వేసవి శిక్షణా తరగతులను ఎంఈవో కేశవరెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు శిక్షణను పొంది జాతీయ స్థాయిలో రాణించి, రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జాతీయ క్రీడాకారులు రామచంద్ర, నానబాలగణేష్, హేమంత్‌కుమార్ , పట్టణ ప్రముఖులు త్రిమూర్తిరెడ్డి, వెంకటేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: Kabaddi training observation in Punganur
