Natyam ad

26 నుంచి వైభవంగా జరగనున్న కడప కన్యకా పరమేశ్వరి మహాత్సవాలు

అమ్మవారిని దర్శించుకుని దీవెనలు పొందండి

కడప ముచ్చట్లు:

ఈ నెల 26 నుంచి అక్టోబర్ 6వతేదీ వరకు కడప కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ చింతకుంట పుల్లయ్య,కడప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మునగా శ్రీనివాసులు అన్నారు శనివారం నగరంలోని అమ్మవారి శాలలో కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈసారి ఒక ప్రత్యేక శైలి లో ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు అమ్మవారు ప్రతిరోజూ ఒక కొత్త తరహా అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు చిన్న పిల్లలకు సైతం ఉత్సవాలగురించి అర్థమయ్యే రీతిలో ఆలయం చరిత్ర సంబంధించిన చిన్న, చిన్న బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు  పూనా నుంచి 30 మంది కళాకారులు రానున్నట్లు తెలిపారు 2వ తేదీనుంచి వీరి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు గోపి సినీ ఆర్ట్స్ వారిచేత ప్రత్యేక అలంకరణ ఉంటుందని చెప్పారు ప్రజలు, భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ కోశాధికారి కాంభోజి గోపాలకృష్ణ శాస్త్రి, యాదాళ్ళ వెంకట రమణయ్య శ్రేష్ఠి, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Kadapa Kanyaka Parameshwari Mahatsavalu will be held from 26

Post Midle

Leave A Reply

Your email address will not be published.