నవంబరు 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదల 

Kadapa Reds released in Kamma Kingdom on 29th

Kadapa Reds released in Kamma Kingdom on 29th

Date:23/11/2019

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని నవంబరు 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ….800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు,విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని  చిత్రబృందం వెల్లడించింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని…ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని  ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్.

 

నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం` ప్రీ రిలీజ్ వేడుక‌

 

Tags:Kadapa Reds released in Kamma Kingdom on 29th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *