Natyam ad

కడప, తిరుపతి ఫోర్ లైన్ పనులు ప్రారంభం

తిరుపతి ముచ్చట్లు:


కడప తిరుపతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కడప- తిరుపతి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. రాజంపేట వద్ద ఈ హైవేకి సంబంధించిన పనులకు తొలి అడుగు పడింది. కడప నుంచి తిరుపతికి 4 లైన్ల రహదారి  2,200 కోట్లతో నిర్మాణం కానుంది. దీనికి సంబంధించిన క్లీన్ అండ్‌ గ్రబ్బింగ్‌ పనులను గ్రీన్ ఫీల్డ్‌ హైవే లైజనింగ్‌ ఆఫీసర్ హర్ష అభిరామ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పనులు పూర్తి అవ్వడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టు పనులు మొత్తంగా రెండు ప్యాకేజీల కింద జరగనున్నాయి. మొదటి ప్యాకేజీ కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు , రెండవ ప్యాకేజీ కింద రేణిగుంట 59 కిలో మీటర్ల వరకు జరగనుంది. ఈ హైవే నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

 

 

కడప నుంచి రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు, 8 వెహికల్‌ అండర్‌ పాస్‌ లు, 72 మేజర్‌, మైనర్‌ బ్రిడ్జిలు, 240 కల్వర్టులు, 3 రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి లను నిర్మించనున్నారు.ఈ హైవే పూర్తి అయితే కనుక కడప నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. ఎక్కువ మలుపులు లేకుండా రోడ్డు మార్గం తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న మలుపుల రోడ్డు వలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోయారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రజల బాధలు కొంచెం తీరినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హైవే పూర్తి అయితే అటు బెంగళూరు నుంచి కానీ, ఇటు హైదరాబాద్‌ నుంచి కానీ తిరుపతి వచ్చే వారికి మార్గం సుగమం అవుతుంది.

 

Post Midle

Tags: Kadapa, Tirupati four line work started

Post Midle