ఎంసెట్ ఫలితాలు విడదల చేసిన కడియం శ్రీహరి

Kadiyam Srihari who made the EAMCET outcome
Date:19/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎంసెట్ 2018 ఫలితాలు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేసారు. ఇంజనీరింగ్ అప్లై చేసుకున్న విద్యార్థులు 1,47,958 కాగా, పరీక్షకు  1.36.305 మంది హాజరయ్యారు. 1,06,646 మంది క్వాలిఫై అయ్యారు.  పాస్ పర్సెంటేజ్ 78.24% . అగ్రికల్చర్, ఫార్మసీ కి 73,106 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అయితే. పరీక్షకు హాజరైన విద్యార్థులు 66,858, క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య  60,651, పాస్ శాతం 90.72% .  మంత్రి మాట్లాడుతూ కొంతమంది ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల ఫలితాలు ఇవ్వడం లేదు. 69.40 % శాతం మాత్రమే ర్యాంక్ లు ఇస్తున్నామని అన్నారు. 8 జూన్ వరకు ఫస్ట్ వరకు పూర్తి చేస్తాం . మే  25 నుండి మొదటి ఫేస్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది.  జులై  16 వ తేదీ నుండి క్లాసెస్ ప్రారంభిస్తాం. అన్ని విషయాలు విద్యార్థులకు ఎస్ ఎం ఎస్ ద్వారా పంపిస్తాం. దీనిపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల దేశంలోనే మన కాలేజీలు మంచి స్థానం లో ఉన్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలను ఎంపిక చేసుకునేప్పుడు మంచి కాలేజీలను ఎంచుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగంలో మాదాపూర్ కు చెందిన  అయ్యపు వెంకటపని వంశినాధ్  ఫస్ట్ ర్యాంక్  వచ్చింది. రెండవ ర్యాంకు  గట్టు మైత్రేయ, మూడవ ర్యాంకు గోశాల వినాయక్ సాధించిరు. అగ్రి ఫార్మసీ విభాగంలె  పెరిగేలా నమ్రత మొదటి ర్యాంకు, వై. సంజీవకుమార్ రెడ్డి రెండవ ర్యాంకు,  సామల శ్రీ ఆర్యన్ మూడవ ర్యాంకు సాధించారు.
Tags: Kadiyam Srihari who made the EAMCET outcome

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *